![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో.....ధీరజ్, తిరుపతి వాళ్ళతో పడుకోవడానికి బయటకు వస్తాడు. దాంతో ప్రేమ ఒక్కతి గదిలో భయపడుతుంది.. వెళ్లి లోపల పడుకోమని తిరుపతి, చందులు బలవంతంగా ధీరజ్ ని లోపలికి పంపిస్తారు. ధీరజ్ గదిలోకి వెళ్లేసరికి ప్రేమ కోపంగా ఉంటుంది. నేను బెడ్ పైన పడుకుంటానని ధీరజ్ అంటాడు. నేను ముందు అంటే ఏదో అన్నట్లున్నావ్ అంటు తన మాట తనకే చెప్తుంది ప్రేమ.
ఆ తర్వాత ధీరజ్ నొప్పులతో నేలపైన పడుకుంటాడు. మరొకవైపు సాగర్, నర్మదలు రామరాజుతో చందు మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటారు. నిజంగా బావగారు చాలా గ్రేట్ అని నర్మద అంటుంది. మరి నేను గ్రేట్ కాదా అని సాగర్ అంటాడు. ఇద్దరు కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ప్రేమ తన ఇంటి ముందుకి వచ్చి.. తన తల్లి రేవతిని పిలుస్తుంది. అయిన రేవతి పలకదు. లోపలికి వెళ్లి రేవతి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ కూడా బాధపడుతుంటే.. అప్పుడే నర్మద వచ్చి బాధపడకని చెప్తుంది.
ఆ తర్వాత రామరాజు, వేదవతిలు చందుకి అమ్మయిని చూడడానికి వెళ్తారు. తరువాయి భాగంలో ఇద్దరు వెళ్తుంటే.. భద్రవతి చూస్తూ ఉంటుంది. పెళ్లి చూపులకి వెళ్లి అమ్మాయి బాగుందని వేదవతి చెప్తుంది. రామరాజు, వేదవతిలు ఇంటికి వచ్చేసరికి ప్రేమ, ధీరజ్ లకి తిరుపతి ఫోటోషూట్ జరిపిస్తాడు. దాంతో రామరాజు కోపంగా తిరుపతి చెంప చెళ్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |